ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా, సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ లంకేశుడిగా కనిపిస్తారు. నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రంలో హిందీలో ప్రభాస్ పాత్రకి శరద్ కేల్కర్ డబ్బింగ్ చెప్పనున్నారు. రాముడి పాత్రకు గొంతు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా. దర్శకుడు ఓం రౌత్ మొదటి రోజు నుంచే నేను ప్రభాస్ పాత్రను డబ్బింగ్ చెప్పాలని భావించారు అని శరద్ కేల్కర్ తెలిపారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఆదిపురుష్ వచ్చే ఏడాది జూన్ 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది.