Skip to main content

Namaste NRI

మొదటి రోజే పెనుమార్పులకు ట్రంప్‌ శ్రీకారం

అమెరికా పాలనా పగ్గాలు చేపట్టిన మొదటి రోజే తన ముద్ర స్పష్టంగా కనిపించాలని డొనాల్డ్‌ ట్రంప్‌ యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. అధ్యక్షుడిగా ప్రమాణం చేసే జనవరి 20న సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసేలా ట్రంప్‌ కార్యవర్గం ప్రణాళికలు రచిస్తున్నది. క్యాపిటల్‌ హిల్‌లో జరిగిన ఓ ప్రైవేట్‌ పార్టీలో రిపబ్లికన్‌ సెనేటర్లకు ట్రంప్‌ ఈ విషయాన్ని వెల్లడించినట్టు సమాచారం. యూఎస్‌-మెక్సికో సరిహద్దులో చొరబాట్ల కట్టడి, ఫెడరల్‌ షెడ్యూల్‌ ఎఫ్‌ ఉద్యోగుల నిబంధనలు, స్కూల్‌ జెండర్‌ పాలసీ, టీకాలు, ఎన్నికల హామీలు తదితర అంశాలకు సంబంధించిన అంశాలు ఈ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లో ఉన్నట్టు తెలుస్తున్నది.

Social Share Spread Message

Latest News