Skip to main content

Namaste NRI

రకుల్ బెటరా.. రెజీనా బెటరా అంటే ఏం చెప్తానండీ.. సందీప్ కిషన్ మజాకా టీజర్‌

సందీప్‌ కిషన్ హీరోగా నటిస్తోన్న చిత్రం మ‌జాకా. రీతూ వ‌ర్మ హీరోయిన్‌.  త్రినాథరావు న‌క్కిన‌ దర్శకత్వం.  ఇప్పటికే లాంచ్ చేసిన మ‌జాకా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌లో సందీప్ కిష‌న్ పంచె క‌ట్టులో కొత్తగా క‌నిపిస్తూ సందడి చేస్తున్నాడు.తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు. ఆర్కే బీచ్‌లో మందుకొడుతున్న ఇద్దరినీ స్టేషన్‌కు తీసుకొచ్చాం సార్, హీరోహీరోయిన్లు స్టేషన్‌లో ఉన్న సీన్లతో మొదలైంది టీజర్‌. ఫన్‌ ఎలిమెంట్స్‌తో సాగనున్నట్టు టీజర్  చెబుతోంది. అక్కడ పోసుకున్న ది బీరు కాదండి, నా ఉసురు అని సందీప్ కిషన్‌ అంటుంటే, నాకు తెలియక అడుగుతున్నాను బీర్‌ బెటరా, విస్కీ బెటరా అని అడుగుతోంది రీతూవర్మ. దీనికి రకుల్ బెటరా, రెజీనా బెటరా అంటే ఏం చెప్తానండీ అంటున్నాడు. ఈ చిత్రంలో రావు రమేశ్, మన్మథుడు ఫేం అన్షు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నారు. ఈ మూవీని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events