ఎదురుగా వస్తున్న వాహనాన్ని గుర్తించి అంధులను అప్రమత్తం చేయడంతో పాటు, ఎటువెళ్లాలో మార్గనిర్దేశం చేసే చెస్ట్ మౌంటెడ్ వీడియో కెమెరాను, వైబ్రేటింగ్ బ్యాండ్‌ను అమెరికాలోని మాస్ జనరల్ బ్రిఘమ్ దవాఖాన పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పరికరంలో ఉండే సెన్సర్లు, బ్లూటూత్ వ్యవస్థ ఎదురుగా ఉన్న వస్తువు లేదా వాహనాన్ని కొన్ని మీటర్ల ముందుగానే గుర్తించి అప్రమత్తం చేస్తుందన్నారు. అలాగే, ఖాళీ ప్రదేశం ఎటువైపు ఉన్నదో కూడా వెల్లడిస్తుందని తెలిపారు. కరెంట్ పోల్స్, మ్యాన్‌హోల్స్ వంటి ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి చూపులేని వారిని అప్రమత్తం చేస్తుందని పేర్కొన్నారు. కెమెరాను ఛాతీకి, బ్యాండ్‌ను మణికట్టుకు ధరించవచ్చని చెప్పారు. ఈ వ్యవస్థను వాడితే ఇప్పటివరకూ 37 శాతం వరకు ప్రమాదాలు తగ్గాయని తెలిపారు.