టోక్యో ఒలింపిక్స్‌లో తెలుగుతేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. గ్రూప్ జె తొలిరౌండులో సింధు ఇజ్రాయెల్‌కు చెందిన సెనియా పొలికర్సోవాపై గెలిచి రెండో రౌండులోకి ప్రవేశించింది. సింధు ఈ మ్యాచ్‌లో సెమియాపై 21-7, 21-10 తేడాతో వరుస సెట్లలో గెలుపొందింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఆశలను సజీవంగా ఉంచుతూ మన సింధు తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. గ్రూప్ జేలో ఉన్న సింధు మహిళల సింగిల్స్‌లో తొలి మ్యాచ్‌లో సత్తా చాటింది. ఇజ్రాయెల్ షట్లర్ పొలికర్పోవాపై తలపడిన సింధు కేవలం 28 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించి ప్రత్యర్థిని ఓడిరచింది. ఇజ్రాయెల్ షట్లర్‌పై పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించి రెండో రౌండులోకి అడుగుపెట్టింది. 26 ఏళ్ల సింధు ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించే దిశగా దూసుకుపోయింది.