Namaste NRI

సందీప్‌ కిషన్‌ మైఖేల్‌ మూవీ నుండి క్రేజీ అప్‌డేట్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ నటుడిగానే కాకుండా నిర్మాత‌గా కూడా స‌క్సెస్ అయ్యాడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘మైఖేల్‌’ ఒకటి.  ఈ సినిమాలో సందీప్‌కు జోడీగా దివ్యాంశ కౌశిక్‌ నటిస్తుంది. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్నాడు.  ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్ ఎల్ఎల్‌పి,క‌ర‌ణ్ సి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ల‌పై పుస్కుర్‌ రామ్‌మోహ‌న్ రావు, భ‌ర‌త్ చౌద‌రీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజైన టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ మరో అప్‌డేట్‌తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు.

ఈ మూవీలోని ఫస్ట్‌ సింగిల్‌ను డిసెంబర్‌ 28న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. సామ్‌ సీఎస్‌ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. తమిళ నటి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, వ‌రుణ్ సందేష్ కీల‌క‌పాత్రల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events