అగ్రరాజ్యం అమెరికాపై కొవిడ్ మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. కొద్ది రోజులుగా ఇక్కడ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 24 గంటల్లో 88 వేలకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత అమెరికాలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కొవిడ్ వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. జులై 25తో ముగిసిన వారంలో అమెరికాలో 5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.