ఈటల రాజేందర్ ఎవరికోసం, ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈటల తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే బీజేపీలో చేరారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్‌గౌడ్ దూసరి, కార్యదర్శులు సత్యమూర్తి చిలుముల, సతీశ్‌రెడ్డి గొట్టెముక్కుల, శానబోయిన రాజ్‌కుమార్, విక్రమ్‌కుమార్, తిరుమందాస్ నరేశ్, రఘువరణ్ తదితరులు పాల్గొన్నారు.