గాలి ప్రత్యూష సమర్పణలో శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై యోగేశ్వర్, అతిధి జంటగా సాయి శివాజీ దర్శకత్వంలో, జివివి గిరి నిర్మించిన లవ్ అండ్ క్రైం కామెడీ ఎంటర్టైనర్ చిత్రం పరారీ. ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్ కు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 30న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్నీ థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింప బడుతుంది…ఈ సందర్బంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జీవీవీ గిరి మాట్లాడుతూ అన్ని కమర్షియల్ అంశాలతో సినిమా ఆకట్టుకుందనే ఫీడ్ బ్యాక్ వస్తున్నది. పాటలు, ఫైట్స్ బాగున్నాయని చెబుతున్నారు. సుమన్ పాత్ర కీలకంగా ఉండి ఆకట్టుకుంటున్నది. మా తొలి ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు.
ఈ చిత్రంలో సుమన్, భూపాల్, శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు.. నిర్మాత: జి వి వి గిరి, దర్శకత్వం: సాయి శివాజీ, సంగీతం మహిత్ నారాయణ్, లిరిక్ రైటర్స్: మజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, సినిమాటోగ్రఫీ; గరుడ వేగా అంజి, ఎడిటర్ గౌతమ్ రాజు, ఆర్ట్స్; ఆనంద్, కోటి అబలయ్, యాక్షన్ :నందు, కొరియోగ్రఫీ: జానీ, భాను, పి. ఆర్. ఓ : సతీష్. కె.