Skip to main content

Namaste NRI

పరారీ మూవీ సక్సెస్ మీట్

గాలి ప్రత్యూష సమర్పణలో శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై యోగేశ్వర్, అతిధి జంటగా సాయి శివాజీ దర్శకత్వంలో, జివివి గిరి నిర్మించిన లవ్ అండ్ క్రైం కామెడీ ఎంటర్టైనర్ చిత్రం పరారీ. ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్ కు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 30న  గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్నీ థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింప  బడుతుంది…ఈ సందర్బంగా హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జీవీవీ గిరి మాట్లాడుతూ అన్ని కమర్షియల్‌ అంశాలతో సినిమా ఆకట్టుకుందనే ఫీడ్‌ బ్యాక్‌ వస్తున్నది. పాటలు, ఫైట్స్‌ బాగున్నాయని చెబుతున్నారు. సుమన్‌ పాత్ర కీలకంగా ఉండి ఆకట్టుకుంటున్నది. మా తొలి ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు.

ఈ చిత్రంలో సుమన్, భూపాల్, శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు.. నిర్మాత: జి వి వి గిరి, దర్శకత్వం: సాయి శివాజీ, సంగీతం మహిత్ నారాయణ్, లిరిక్ రైటర్స్: మజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, సినిమాటోగ్రఫీ; గరుడ వేగా అంజి, ఎడిటర్ గౌతమ్ రాజు, ఆర్ట్స్; ఆనంద్, కోటి అబలయ్, యాక్షన్ :నందు, కొరియోగ్రఫీ: జానీ, భాను,  పి. ఆర్. ఓ : సతీష్. కె.

Social Share Spread Message

Latest News