మెగాస్టార్చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. తమన్నా కథానాయిక. మెహర్ రమేష్ దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సుస్మిత కొణిదెల స్టైలింగ్, కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్నారు. భోళా మేనియా పేరుతో ఈ సినిమా తొలి గీతాన్ని విడుదల చేశారు. అదిరే స్టెల్ అయ్యా పగిలే స్వాగ్ అయ్యా యుఫోరియా నా ఏరియా భోళా మేనియా అంటూ ఫాస్ట్‌బీట్‌తో ఈ పాట సాగింది. రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ గీతాన్ని రేవంత్ ఎల్వీ ఆలపించారు. ఇందులో చిరంజీవి స్టెలిష్‌గా కనిపించారు. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నది. ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్.