Skip to main content

Namaste NRI

భోలా శంకర్‌ నుంచి భోలా మేనియా

మెగాస్టార్చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్‌. తమన్నా కథానాయిక.   మెహర్‌ రమేష్‌ దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సుస్మిత కొణిదెల స్టైలింగ్, కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్నారు.  భోళా మేనియా పేరుతో ఈ సినిమా తొలి గీతాన్ని విడుదల చేశారు. అదిరే స్టెల్‌ అయ్యా పగిలే స్వాగ్‌ అయ్యా యుఫోరియా నా ఏరియా భోళా మేనియా అంటూ ఫాస్ట్‌బీట్‌తో ఈ పాట సాగింది. రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ గీతాన్ని రేవంత్‌ ఎల్వీ ఆలపించారు. ఇందులో చిరంజీవి స్టెలిష్‌గా కనిపించారు. సిస్టర్‌ సెంటిమెంట్‌ ప్రధానంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్‌ నటిస్తున్నది. ఆగస్ట్‌ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.  ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మెహర్‌ రమేష్‌.

Social Share Spread Message

Latest News