క్రిష్ సిద్దిపల్లి, రితిక చక్రవర్తి, ఐశ్వర్యగౌడ, సుచంద్ర ప్రసాద్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం రేవ్ పార్టీ. రాజు బొనగాని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. దర్శక నిర్మాత రాజు మాట్లాడుతూ రేవ్‌పార్టీల వెనుక ఎవరెవరు వుంటారు? వాటి వల్ల యువతకు జరిగే నష్టమేమిటి అనేది ఈ చిత్రంలో స్పష్టంగా చూపెడుతున్నాం. నేటి యువతరం నచ్చే అంశాలతో ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటోంది. మైసూర్, ఉడిపి, బెంగళూరు,మంగళూరులో చిత్రీకరణ చేశాం. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తన్నాం అన్నారు. ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు: బ్యానర్ : బొనగాని ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు : రాజు బొనగాని, డైరెక్టర్ : రాజు బొనగాని, సినిమాటోగ్రఫీ: వెంకట్ మన్నం, సంగీత దర్శకుడు : దిలీప్ బండారి, ఎడిటర్ : రవికుమార్ కె, ఆర్ట్ డైరెక్టర్ : వెంకట్ ఆరే, కో డైరెక్టర్ : నాగరాజు నాయక్ డి, డైలాగ్ రైటర్ : సూర్య-ప్రేమ్ బీఎస్, పబ్లిసిటీ డిజైనర్ : లక్కీ, సహనిర్మాతలు : లక్ష్మీకాంత్ ఎన్ఆర్, జయరామ్ డీఆర్, సీతారామరాజు జి ఎస్, నారయాణ స్వామి ఎస్, పీఆర్ఓ : హరీష్, దినేష్.