Skip to main content

Namaste NRI

షూటింగ్ పూర్తి చేసుకున్న రేవ్ పార్టీ.. ఆగస్ట్ లో విడులకు సన్నాహాలు

క్రిష్‌ సిద్దిపల్లి, రితిక చక్రవర్తి, ఐశ్వర్యగౌడ, సుచంద్ర ప్రసాద్‌ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం రేవ్‌ పార్టీ. రాజు బొనగాని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. దర్శక నిర్మాత రాజు మాట్లాడుతూ రేవ్‌పార్టీల వెనుక ఎవరెవరు వుంటారు? వాటి వల్ల యువతకు జరిగే నష్టమేమిటి అనేది ఈ చిత్రంలో స్పష్టంగా చూపెడుతున్నాం.  నేటి యువతరం నచ్చే అంశాలతో ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటోంది. మైసూర్‌, ఉడిపి, బెంగళూరు,మంగళూరులో చిత్రీకరణ చేశాం. తెలుగు, హిందీ, తమిళ్‌, మలయాళ భాషల్లో చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తన్నాం అన్నారు. ఈ చిత్రానికి  సాంకేతిక నిపుణులు: బ్యానర్ : బొనగాని ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు : రాజు బొనగాని, డైరెక్టర్ : రాజు బొనగాని, సినిమాటోగ్రఫీ: వెంకట్ మన్నం, సంగీత దర్శకుడు : దిలీప్ బండారి, ఎడిటర్ : రవికుమార్ కె, ఆర్ట్ డైరెక్టర్ : వెంకట్ ఆరే, కో డైరెక్టర్ : నాగరాజు నాయక్ డి, డైలాగ్ రైటర్ : సూర్య-ప్రేమ్ బీఎస్, పబ్లిసిటీ డిజైనర్ : లక్కీ, సహనిర్మాతలు : లక్ష్మీకాంత్ ఎన్ఆర్, జయరామ్ డీఆర్, సీతారామరాజు జి ఎస్, నారయాణ స్వామి ఎస్, పీఆర్ఓ : హరీష్, దినేష్.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events