పార్లమెంటును కుదిపేస్తున్న పెగాసస్ నిఘా వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం మౌనం వీడిరది. సైనిక శ్రేణి స్పైవేర్ తయారీ సంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూపుతో తాము ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని రాజ్యసభలో రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఎన్‌ఎస్‌వో గ్రూప్ టెక్నాలజీస్‌తో రక్షణ శాఖకు ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా అని సీపీఎం సభ్యుడు వి.శివదాసన్ రాజ్యసభలో ప్రశ్నించారు. ఒక వేళ ఉంటే వాటి వివరాలు చెప్పాలని అడిగారు. దానికి రక్షణశాఖ సహాయమంత్రి అజయ్ భట్ లిఖితపూర్వక సమాధానమిస్తూ ఆ సంస్థతో ఎలాంటి లావాదేవీలు తాము జరపలేదని తేల్చి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్లో రక్షణ శాఖ వాటా 15.49 శాతం ఉందన్నారు.