మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మా అధ్యక్షుడు నరేష్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఆరోపించిన నటి హేమాకు షోకాజ్ నోటీలసులు జారీ అయ్యారు. ఇటీవల హేమ తనపై చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన నరేష్ అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా ఆమె ప్రయత్నిస్తున్నారని అన్నారు. హేమపై నరేష్ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేయడంతో వారు ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.