Namaste NRI

ఇరానీ ఛాయ్ లాంటి చిత్రమిది 

శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భాగ్‌ సాలే. ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకుడు. వేదనీష్ క్రియాటివ్ వర్క్స్ బ్యానర్ లో అర్జున్ దాస్యన్, యాష్ రాగినేని, కళ్యాణ్ నిర్మించారు. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, హర్ష చెముడు, జాన్ విజయ్, వర్షిణి, నందిని రాయ్, తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.   క్రైమ్‌ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ  సినిమా ట్రైలర్‌ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ భాగ్‌ సాలే అనే సౌండింగ్‌లోనే ఓ ఫన్‌ క్రియేట్‌ అవుతుంది. ఇది పూర్తిగా హైదరాబాద్‌ నేపథ్యంలో నడిచే కథ. సికింద్రాబాద్‌, వారాసిగూడ, పాతబస్తీలో చిత్రీకరణ జరిపాం అన్నారు.

ఈ సినిమాలో అర్జున్‌ అనే ఓ టక్కరి దొంగ పాత్రలో కనిపిస్తానని, ఓ విలువైన ఉంగరం దొరకడం వల్ల అతని జీవితంలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయనేది ఆద్యంతం వినోదాన్ని పంచుతుందని శ్రీసింహా కోడూరి తెలిపారు. నిర్మాత అర్జున్‌ దాస్యన్‌ మాట్లాడుతూ క్రైమ్‌ కామెడీ తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన జోనర్‌. హైదరాబాద్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో చక్కటి వినోదంతో ఈ చిత్రం ఆకట్టుకుంటుంది అన్నారు. కాగా, జులై 7న ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో ప్రియదర్శి, నందినీ రాయ్, అర్జున్ దాస్యన్, కాలభైరవ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events