టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ డెవిల్. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. స్వీయ దర్శకనిర్మాణంలో అభిషేక్ నామా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ జోడీగా సంయుక్త నటిస్తోంది. సంయుక్తమీనన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సినిమాలోని ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె సంప్రదాయ వస్త్రధారణలో వెలిగిపోతున్నది. పూలబుట్టని చేత పట్టుకొని దైవ దర్శనానికి వెళ్తూ ప్రశాంత వదనంతో కనిపిస్తున్నది. ఎవరికీ అంతుపట్టని ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కల్యాణ్‌రామ్ పాత్ర ఉత్కంఠను పంచుతుందని, కథానాయిక సంయుక్త మీనన్ నైషధ అనే సంప్రదాయ అమ్మాయి పాత్రలో కనిపిస్తుందని దర్శకుడు అభిషేక్ నామా తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌రాజన్ ఎస్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: శ్రీకాంత్ విస్సా, నిర్మాణ సంస్థ: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత, దర్శకత్వం: అభిషేక్ నామా.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)