Skip to main content

Namaste NRI

డెవిల్ లో నైషధ గా సంయుక్త.. అందానికే అసూయ పుట్టేలా ఫస్ట్‌లుక్‌

టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ డెవిల్. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. స్వీయ దర్శకనిర్మాణంలో అభిషేక్‌ నామా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో క‌ళ్యాణ్ రామ్ జోడీగా సంయుక్త నటిస్తోంది.  సంయుక్తమీనన్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సినిమాలోని ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె సంప్రదాయ వస్త్రధారణలో వెలిగిపోతున్నది. పూలబుట్టని చేత పట్టుకొని దైవ దర్శనానికి వెళ్తూ ప్రశాంత వదనంతో కనిపిస్తున్నది. ఎవరికీ అంతుపట్టని ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా కల్యాణ్‌రామ్‌ పాత్ర ఉత్కంఠను పంచుతుందని, కథానాయిక సంయుక్త మీనన్‌ నైషధ అనే సంప్రదాయ అమ్మాయి పాత్రలో కనిపిస్తుందని దర్శకుడు అభిషేక్‌ నామా తెలిపారు.  ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌రాజన్‌ ఎస్‌, సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: శ్రీకాంత్‌ విస్సా, నిర్మాణ సంస్థ: అభిషేక్‌ పిక్చర్స్‌, నిర్మాత, దర్శకత్వం: అభిషేక్‌ నామా.

Social Share Spread Message

Latest News