రోషన్ కనకాల హీరోగా నటించిన చిత్రం బబుల్గమ్. మానసా చౌదరి కథానాయిక. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాల దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకుడు. మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందు రోషన్‌కి నా అభినందనలు. నటుడిగా తను మంచి స్థాయికి వెళ్లాలి. పరిశ్రమలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకోవాలి. తన తల్లిదండ్రులు రాజీవ్, సుమ గర్వపడేలా ఎదగాలి అంటూ శుభాకాంక్షలు అందించారు. ఇదొక రొమాంటిక్ లవ్‌స్టోరీ అని, అక్టోబర్ 10న ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ గ్లింప్స్‌ని విడుదల చేస్తున్నామని మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్ రగుతు, సంగీతం: శ్రీచరణ్ పాకాల.
