Skip to main content

Namaste NRI

రోషన్‌ కనకాల బబుల్‌గమ్ ఫస్ట్ లుక్‌

రోషన్‌ కనకాల హీరోగా  నటించిన చిత్రం బబుల్‌గమ్‌. మానసా చౌదరి కథానాయిక. క్షణం, కృష్ణ అండ్‌ హిజ్‌ లీల చిత్రాల దర్శకుడు రవికాంత్‌ పేరెపు దర్శకుడు. మహేశ్వరి మూవీస్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ముందు రోషన్‌కి నా అభినందనలు. నటుడిగా తను మంచి స్థాయికి వెళ్లాలి. పరిశ్రమలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకోవాలి. తన తల్లిదండ్రులు రాజీవ్‌, సుమ గర్వపడేలా ఎదగాలి అంటూ శుభాకాంక్షలు అందించారు. ఇదొక రొమాంటిక్‌ లవ్‌స్టోరీ అని, అక్టోబర్‌ 10న ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ గ్లింప్స్‌ని విడుదల చేస్తున్నామని మేకర్స్‌ తెలియజేశారు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్‌ రగుతు, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల.

Social Share Spread Message

Latest News