బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సంచలన ప్రకటన చేశారు. ఆఫ్గానిస్థాన్ సంక్షోభానికి ఓ పరిష్కారం చూపడం కోసం అవసరమైతే తాలిబన్లతో కలిసి పనిచేస్తామని సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆ మేరకు రాజకీయ, దౌత్యపరమైన చర్యలు చేపడతామన్నారు. తాలిబన్లతో కలిసి పనిచేసే అవకాశం ఉందని ప్రధాని ప్రకటించారు. ప్రస్తుతం అప్గాన్ సంక్షోభం పరిష్కారం కోసం దౌత్య ప్రయత్నాలు చేస్తున్నామని, పరిస్థితులను చక్కబెట్టటానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాలిబన్లతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. తద్వారా అఫ్గాన్ పౌరులకు భరోసా ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడిరచారు. కొన్ని సమస్యల వల్లే బ్రిటన్ పౌరులను స్వదేశానికి తీసుకొచ్చామని తెలిపారు. ఓవైపు తాలిబన్ల పాలనను గుర్తించేందుకు అనేక దేశాలు వెనుకాడుతుంటే బోరిస్ మాత్రం వారితో కలిసి పనిచేస్తాననడం ప్రాధాన్యం సంతరించుకుంది.