రాజీవ్ కనకాల, షకలక శంకర్, శ్రీతేజ్, అక్సాఖాన్, రూపిక ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం దళారి. కాచిడి గోపాల్‌రెడ్డి దర్శకుడు. ఎడవెల్లి వెంకట్‌రెడ్డి నిర్మాత. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్నదమ్ములను అంటూ సాగే పాటను సునీల్, సత్యంరాజేశ్, కోనవెంకట్, నిర్మాత ఎస్. గోపాల్‌రెడ్డి కలిసి విడుదల చేశారు. పాట బావుందని, సినిమా కూడా మంచి విజయం సాధించాలని వారంద రూ ఆకాంక్షించారు. అన్నదమ్ముల అనుబంధమే ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కిందని, అందరికీ నచ్చే సినిమా ఇదని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హరిగౌర, కెమెరా: మెంటం సతీశ్.