రోషన్ కనకాల హీరోగా పరిచయమవుతున్న చిత్రం బబుల్‌గమ్. మానస చౌదరి కథానాయిక. రవికాంత్ పేరేపు దర్శకత్వం. మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మించాయి. హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అనుహాసన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలోని జాను అనే మూడో గీతాన్ని ఈ నెల 6న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు. హృదయాన్ని కదిలించే మెలోడీ ఇది. ప్రేమ ప్రయాణంలోని అందమైన భావనలకు అద్దం పడుతుంది. తప్పకుండా అందరికి నచ్చుతుంది అని దర్శకుడు తెలిపారు. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సురేష్ రగుతు, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ప్రొడక్షన్ డిజైనర్: శివమ్ రావు, రచన-దర్శకత్వం: రవికాంత్ పేరేపు.