Skip to main content

Namaste NRI

రోషన్ కనకాల బబుల్‌గమ్‌ నుంచి ..జాను వచ్చేది ఆరోజే

రోషన్‌ కనకాల హీరోగా పరిచయమవుతున్న చిత్రం బబుల్‌గమ్‌. మానస చౌదరి కథానాయిక.   రవికాంత్‌ పేరేపు దర్శకత్వం. మహేశ్వరి మూవీస్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మించాయి. హర్ష చెముడు, కిరణ్‌ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్‌, అనుహాసన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలోని జాను అనే మూడో గీతాన్ని ఈ నెల 6న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. హృదయాన్ని కదిలించే మెలోడీ ఇది. ప్రేమ ప్రయాణంలోని అందమైన భావనలకు అద్దం పడుతుంది. తప్పకుండా అందరికి నచ్చుతుంది అని దర్శకుడు తెలిపారు. ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సురేష్‌ రగుతు, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, ప్రొడక్షన్‌ డిజైనర్‌: శివమ్‌ రావు, రచన-దర్శకత్వం: రవికాంత్‌ పేరేపు.

Social Share Spread Message

Latest News