రోషన్ కనకాల హీరోగా పరిచయమవుతున్న సినిమా బబుల్‌గమ్. మానస చౌదరి కథానాయిక. రవికాంత్ పేరేపు దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని మూడవ గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. జానూ అంటూ సాగే ఈ పాటను అనంతశ్రీరామ్ రాయగా, శ్రీచరణ్ పాకాల స్వరాలందించారు. జావెద్ అలీ ఆలపించారు. లోతైన సాహిత్యంతో తయారైన ఈ పాట మనసుల్ని హత్తుకుంటుందని, విడుదలైన రెండు పాటలూ శ్రోతల్ని అలరించాయని, ఈ మూడో పాట కూడా అందరికీ నచ్చుతుందని మేకర్స్ నమ్మకం వెలిబుచ్చారు. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్ గరుతు, ఎడిటింగ్: నిషాద్ యూసుఫ్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)