Skip to main content

Namaste NRI

రోషన్ కనకాల బబుల్‌గమ్ నుంచి జాను పాట విడుదల

రోషన్‌ కనకాల హీరోగా పరిచయమవుతున్న సినిమా బబుల్‌గమ్‌. మానస చౌదరి కథానాయిక. రవికాంత్‌ పేరేపు దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్‌ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని మూడవ గీతాన్ని మేకర్స్‌ విడుదల చేశారు. జానూ అంటూ సాగే ఈ పాటను అనంతశ్రీరామ్‌ రాయగా, శ్రీచరణ్‌ పాకాల స్వరాలందించారు. జావెద్‌ అలీ ఆలపించారు. లోతైన సాహిత్యంతో తయారైన ఈ పాట మనసుల్ని హత్తుకుంటుందని, విడుదలైన రెండు పాటలూ శ్రోతల్ని అలరించాయని, ఈ మూడో పాట కూడా అందరికీ నచ్చుతుందని మేకర్స్‌ నమ్మకం వెలిబుచ్చారు. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.   ఈ చిత్రానికి కెమెరా: సురేశ్‌ గరుతు, ఎడిటింగ్‌: నిషాద్‌ యూసుఫ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events