Namaste NRI

తెలంగాణకు అరుదైన గుర్తింపు.. 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం!

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ లో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. సిఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోనే బృందానికి తొలి రోజే మంచి స్పందన లభించింది. ప్రపంచ ఆర్థిక సదస్సు ఆధ్వర్యం లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (సి4ఐఆర్)కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ఒ ప్పందం కుదిరింది. బయో ఏషియా -2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ప్రారంభం కానుంది. తద్వారా సిఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే (స్టేట్ హెల్త్ టెక్ ల్యాండ్ స్కేప్) సాంకేతిక ఆధారిత కార్యక్రమం రూపుదిద్దుకోనుంది. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో వరల్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సు లో వరల్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే ప్రతినిధి బృందంతో సిఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది.

అనంతరం సి4ఐఆర్ హైదరాబాద్ లో ప్రారంభించడంపై సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో టెక్నాలజీ కలయిక తో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తెలంగాణకు వి శిష్ట సహకారం అందించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విశాల దృక్పథం, నిర్దేశించుకు న్న లక్ష్యాలన్నీ తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయని, అందుకే రెండిం టి మధ్య అద్భుతమైన సమన్వయం కుదిరిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జీవన విధానాలు, జీవ న నాణ్యత ప్రమాణాలు మెరుగుపరిస్తే ప్రజల జీవితాలు బాగుపడుతాయనే ఆలోచనల సారూప్యతకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రపంచ స్థాయిలో పని చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజల పై దృష్టి కేంద్రీకరిస్తోందన్నారు. ఇరువురి భాగస్వామ్యంతో ప్రజల ఆరోగ్యం, సాంకేతికత, మంచి జీవితం అందించాలనే లక్ష్యాలను వేగంగా అందుకోవచ్చని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events