వైఎస్ షర్మిల తనయుడు రాజా రెడ్డి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. అట్లూరి ప్రియతో వైఎస్ రాజారెడ్డి వివాహం వచ్చే నెల (ఫిబ్రవరి) 17న జరగనుంది. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వైఎస్ షర్మిల పెళ్లి పత్రికని అందజేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో పవన్‌కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్న షర్మిల, కుమారుడి రాజారెడ్డి పెళ్లికి పవన్‌కళ్యాణ్‌ను ఆహ్వానించారు. జనవరి 18 హైదరాబాద్‌లో వైఎస్ రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్ జరగనుంది.