హైదరాబాద్‌కు చెందిన నిఖిల కన్స్‌ట్రక్షన్స్‌కు ఏషియా బిజినెస్ అవార్డు దక్కింది. సింగపూర్ లో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో సంస్థ ఛైర్మన్ శ్రీనివాసరావు వెలువోలు ఈ పురస్కారాన్ని సాధించారు. అవార్డు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి ఉత్తమ బిల్డర్‌గా అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. మోకిల రాయల్ పెవీలియన్ ప్రాజెక్టు పేరుతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నామన్నారు. మొదటిసారి పోడియం స్లాట్స్‌తో అత్యంత నాణ్యతతో నిర్మిస్తున్నామన్నారు. వేగంగా, కస్టమర్లకు ఇచ్చిన సమయానికి అనుగుణంగా నిర్మాణం జరుగుతుందని ఇది మోకిలకే తలమానికంగా ఉండబోతోందని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)