Namaste NRI

ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే ఆధ్వర్యంలో ఛలో  నల్లగొండ సభ పోస్టర్ ఆవిష్కరణ

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నదీ జలాల హక్కుల పరిరక్షణకై  ఫిబ్రవరి 13న నిర్వహించనున్న ఛలో నల్లగొండ  భారీ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే కోర్‌కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ మేరకు లండన్‌ లోని కేంద్ర కార్యాలయంలో బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు.  ఈ సంద‌ర్భంగా అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ వనరులు సురక్షితంగా ఉన్నాయ చెప్పారు.  రెండు నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితి నాటి సమైక్య పాలనను గుర్తు తెస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ హక్కులను కాలరాస్తే బీఆర్ఎస్ పార్టీ అడుగడుగునా పోరాటాం చేస్తూ ప్రజలకు అండగా నిలబడు తుందని తెలిపారు. ఫిబ్రవరి 13 వ తేదీన నల్గొండలో జరగబోయే సభకు అన్ని వర్గాల ప్రజలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, నవీన్ రెడ్డి , సిక్కా చంద్రశేఖర్ గౌడ్ , సురేష్ బుడగం, రవి రేతినేని, సతీష్ రెడ్డి గొట్టెముక్కల  పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events