తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనతి కాలంలో ప్రజాదరణ పొందుతోందని, విదేశాలలో నివాసముంటున్న తాము కూడా ప్రభుత్వానికి మద్దతునిస్తూ ప్రభుత్వ పని తీరును ఆసక్తిగా గమనిస్తున్నామని తెలంగాణ ప్రవాసీయులు పేర్కొన్నారు. వ్యక్తిగత కార్యక్రమం కోసం బహ్రెయిన్ వెళ్లిన రెవెన్యూ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రవాసీ ప్రముఖుడు, ఖమ్మం జిల్లాకు చెందిన చెల్లంశెట్టి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ప్రవాసీయులు స్వాగతం పలికారు. గల్ఫ్‌లో జరుగుతున్న తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కుమారుడి వివాహాంలో పాల్గొనడానికి ముంత్రి శ్రీనివాస్ రెడ్డి బహ్రెయిన్‌కు వెళ్లారు. ఖమ్మం జిల్లా కరివారిగూడెంకు చెందిన హరిప్రసాద్ బహ్రెయిన్‌లో స్థిరపడ్డారు.