అంజలి కథానాయికగా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను తెరకెక్కిస్తున్నారు. శివ తుర్లపాటి దర్శకుడు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమాస్ పతాకాలపై కోన వెంకట్ నిర్మిస్తున్నారు. అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను వినూత్న పంథాలో విడుదల చేయబోతున్నారు. హారర్ కథాంశం కావడంతో టీజర్‌ను ఈ నెల 24న బేగంపేట స్మశానంలో రిలీజ్ చేసేం దుకు మేకర్స్ ప్లాన్ చేశారు. శ్మశానంలో ఓ సినిమా వేడుక జరగడం ఇదే తొలిసారి అని చిత్రబృందం చెబుతు న్నది. మొదటి భాగం గీతాంజలి ఎక్కడైతే ముగిసిపోయిందే అక్కడే ఈ సీక్వెల్ కథ ఆరంభమవు తుందని, ఆద్యంతం హాస్యంతో ఆకట్టుకుంటుందని, పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: సుజాత సిద్ధార్థ, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, భాను భోగవరపు, కథ: కోన వెంకట్, దర్శకత్వం: శివ తుర్లపాటి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)