Skip to main content

Namaste NRI

స్మశానంలో గీతాంజలి వేడుక

అంజలి కథానాయికగా  గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను తెరకెక్కిస్తున్నారు. శివ తుర్లపాటి దర్శకుడు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమాస్‌ పతాకాలపై కోన వెంకట్‌ నిర్మిస్తున్నారు. అంజలి, శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేష్‌, సత్య, షకలక శంకర్‌ తదితరులు నటిస్తున్నారు.   ఈ సినిమా టీజర్‌ను వినూత్న పంథాలో విడుదల చేయబోతున్నారు. హారర్‌ కథాంశం కావడంతో టీజర్‌ను ఈ నెల 24న బేగంపేట స్మశానంలో  రిలీజ్‌ చేసేం దుకు మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. శ్మశానంలో ఓ సినిమా వేడుక జరగడం ఇదే తొలిసారి అని చిత్రబృందం చెబుతు న్నది. మొదటి భాగం గీతాంజలి ఎక్కడైతే ముగిసిపోయిందే అక్కడే ఈ సీక్వెల్‌ కథ ఆరంభమవు తుందని, ఆద్యంతం హాస్యంతో ఆకట్టుకుంటుందని, పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేస్తామని నిర్మాతలు తెలిపారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ చిత్రానికి కెమెరా: సుజాత సిద్ధార్థ, సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌, భాను భోగవరపు, కథ: కోన వెంకట్‌, దర్శకత్వం: శివ తుర్లపాటి.

Social Share Spread Message

Latest News