నిహాన్, వైష్ణవి కాంబ్లే జంటగా నటిస్తున్న చిత్రం మా ఊరి రాజారెడ్డి. రవి బాసర దర్శకుడు. ఆర్‌ఎస్ మూవీ మేకర్స్ పతాకంపై రజిత రవీంద్ర ఎర్ర, సునీత వెంకట రమణ నిర్మిస్తున్నారు. ఎర్ర రవీందర్, రజని తదిత రులు నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ నిర్మల్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిపాం. కథలోని భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి అన్నారు. రాజా రెడ్డి అనే వ్యక్తి స్ఫూర్తి దాయక జీవిత ప్రయాణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించామని కో డైరెక్టర్ రవీంద్ర సిద్ధార్థ తెలిపారు. అభినయ ప్రధాన పాత్రల్లో నటించడం ఆనందంగా ఉందని నాయకానాయికలు తెలిపారు. ఈ చిత్రం మార్చి1న ప్రేక్షకు ల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: వాసు, సంగీతం: పీకే, దర్శకత్వం: రవి బాసర.