Skip to main content

Namaste NRI

ఘనంగా మా ఊరి రాజారెడ్డి మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

నిహాన్‌, వైష్ణవి కాంబ్లే జంటగా నటిస్తున్న చిత్రం మా ఊరి రాజారెడ్డి. రవి బాసర దర్శకుడు. ఆర్‌ఎస్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై రజిత రవీంద్ర ఎర్ర, సునీత వెంకట రమణ నిర్మిస్తున్నారు. ఎర్ర రవీందర్‌, రజని తదిత రులు నటిస్తున్నారు.  ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ నిర్మల్‌ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్‌ జరిపాం. కథలోని భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి అన్నారు. రాజా రెడ్డి అనే వ్యక్తి స్ఫూర్తి దాయక జీవిత ప్రయాణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించామని కో డైరెక్టర్‌ రవీంద్ర సిద్ధార్థ తెలిపారు. అభినయ ప్రధాన పాత్రల్లో నటించడం ఆనందంగా ఉందని నాయకానాయికలు తెలిపారు. ఈ చిత్రం మార్చి1న ప్రేక్షకు ల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: వాసు, సంగీతం: పీకే, దర్శకత్వం: రవి బాసర.

Social Share Spread Message

Latest News