అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు డెమొక్రాట్ల నుంచి మద్దతు కరువైంది. బైడెన్‌కు బదులుగా వారంతా మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామాను సమర్థిస్తున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. రాస్ము సేన్ రిపోర్ట్స్ విడుదల చేసిన పోల్ సర్వే డాటా ప్రకారం 48 శాతం మంది డెమొక్రాట్లు బైడెన్‌ను ప్రాతినిథ్యాన్ని వ్యతిరేకించారు. మిషెల్ అభ్యర్థిత్వానికి 20 శాతం మంది, కమలాహ్యారిస్‌కు 15 శాతం, హిల్లరీ క్లింటన్‌కు 12 శాతం మంది మద్దతు తెలిపారు.