భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవిత చరిత్ర వెబ్‌సిరీస్‌గా రానుంది. ఆహా స్టూడియో, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు పీవీ నరసింహారావు బయోపిక్ హాఫ్ లయన్ ను తెరకెక్కిస్తున్నట్లు గతంలోనే ప్రకటించాయి. ఇటీవల పీవీకి భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో ఈ సిరీస్‌పై మరింత కసరత్తులు చేస్తు న్నట్లు నిర్మాణ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రముఖ రచయిత వినయ్ సీతాపతి రచించిన హాఫ్ లయన్ పుస్తకం ఆధారంగా, సీనియర్ దర్శకుడు ప్రకాష్ ఝా ఈ సిరీస్‌ను రూపొందించబోతున్నారు. ఈ పాన్ ఇండి యా సిరీస్ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, హిందీ, తెలుగు భాషల్లో విడుదల చేయబోతున్నామని, పీవీ నరసింహారావు జీవనయానాన్ని ఈ సిరీస్‌లో కళ్లకు కట్టినట్లుగా చూపించబోతున్నా మని దర్శకుడు తెలిపారు. ఈ సిరీస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించ బోతున్నారు.