Namaste NRI

సునీల్‌ భారతీ మిట్టల్‌కు అరుదైన గౌరవం

భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ అధినేత సునీల్‌ భారతీ మిట్టల్‌కు అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్‌ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక నైట్‌హుడ్‌ పురస్కారం సునీల్‌ మిట్టల్‌ను వరించింది. యూకే, ఇండియా మధ్య వ్యాపార సంబంధాల్లో మిట్టల్‌ చేసిన సేవలకు గాను ఈ అవార్డును బహుకరించారు. బ్రిటిష్‌ అవార్డుల జాబితాలో అత్యంత ఉన్నత పురస్కారంగా పేర్కొనే నైట్‌ కమాండర్‌ ఆఫ్‌ మోస్ట్‌ ఎక్సలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌ (కేబీఈ) ఒకటి.  కింగ్‌ చార్లెస్‌-3 చేతుల మీదుగా నైట్‌హుడ్‌ అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా సునీల్‌ మిట్టల్‌ చరిత్ర సృష్టించారు.

Social Share Spread Message

Latest News