వరుణ్‌తేజ్ కథానాయకుడిగా శక్తిప్రతాప్‌సింగ్ హడా దర్శకత్వంలో రూపొందిన ఆపరేషన్ వాలెంటైన్. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సిద్ధు ముద్దా, నందకుమార్ అబ్బినేని పాత్రికేయులతో ముచ్చటిస్తూ ఫైటర్ తర్వాత ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిన చిత్రమిది. దర్శకుడు శక్తిప్రతాప్‌కు వీఎఫ్‌ఎక్స్ నేపథ్యం ఉంది. దాంతో సినిమాను అద్భుతంగా తీశాడు. గ్వాలియర్ ఎయిర్‌బేస్‌లో ప్రత్యేక అనుమ తులు తీసుకొని ఈ సినిమా షూటింగ్ చేశాం. అందుకే ఎయిర్‌బేస్ విజువల్స్ చాలా నేచురల్‌గా, గ్రాండ్‌నెస్‌తో కనిపిస్తాయి అన్నారు. ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఈ సినిమా చూసిన తర్వాత ఎంతగానో ప్రశంసించారని, ఏం చెప్పారో అదే తీశారని మెచ్చుకున్నారని వారు తెలిపారు. రియల్ ఎయిర్‌బేస్‌లో షూట్ చేయడం ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. దేశరక్షణలో సైనికుల త్యాగాలను, ధైర్యసాహసాలను స్మరించు కుంటూ, వారి పోరాటాన్ని ప్రేక్షకులకు చూపించాలనే లక్ష్యంతో ఈ సినిమా తీశాం. రియల్ హీరోస్ కథ ఇది. భవిష్యత్తులో అందరు హీరోలతో సినిమాలు చేస్తాం అని పేర్కొన్నారు. ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకురానుంది.