అమెరికా తెలుగు సంఘం (ఆటా) గత 34 సంవత్సరాలుగా అమెరికాలోని తెలుగు వారికి అన్ని విషయాలలో వెన్ను దన్నుగా ఉంటుంది. ఆటా కేవలం అమెరికాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి, కొనసాగిస్తున్నారు. ఆటా కన్వెన్షన్ 2024 అట్లాంటా లో జూన్ 7 నుంచి 9 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా, సర్వజనులకు ఉపయుక్తంగా జరగబోతున్నది. పోయిన సంవత్సరం నుండే మొదలైన ఏర్పాట్లు, ఇప్పుడు మరింత జోరందుకున్నాయి. ఎన్నో ప్రాంతాలలో ఫండ్ రైజింగ్, కిక్ ఆఫ్ మీటింగులు జరిగాయి.
అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కన్వీనర్ కిరణ్ పాశం నాయకత్వంలో కోర్ కమిటీ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో ఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ ఆధ్వర్యంలో 70 కమిటీలలో 300 మందికి పైగా వాలంటీర్లు అవిశ్రాంతం గా పాటు పడుతున్నారు. వీరందరూ వారానికి ఒక్కసారి ఇన్ పర్సన్ మరియు ఆన్‌లైన్ మీటింగుల ద్వారా కలుస్తూ, గతిని, ప్రగతిని పరిశీలిస్తూ, సూచనలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆటా వారి సిగ్నేచర్ పోటీలు చాలా ఉన్నాయి. కొన్ని డైరెక్టుగా కన్వెన్షన్‌లో ఉంటాయి, కొన్ని వివిధ నగరాలలో నిర్వహించి, ఫైనల్స్ కన్వెన్షన్ అప్పుడు జరుగుతాయి. 3 రోజుల పాటు సాగే కల్చరల్ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేది ఫిబ్రవరి 29.
ఉత్సాహవంతులైన గాయనీ గాయకులకు అత్యంత ప్రోత్సాహకరంగా నువ్వా నేనా అన్నట్టు సాగే రaుమ్మంది నాదం పాటల పోటీలు పలు నగరాలలో నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ లింకు మరియు శాంపిల్ ఫ్లయర్ ఒక్కొక్క నగారానికి ఒక్కొక్కటి ఉంటుంది. సయ్యంటే సై అన్నట్టుగా సాగే సయ్యంది పాదం సరే సరి. కాలు కడుపుదాం. ప్రైజ్ గెలుద్దాం అనుకుంటున్నారాÑ ఇకేం డాన్స్ పోటీలకు నమోదు చేసుకోండి. వనితలకు, మగవారికి, యువతకు ఆత్మ విశ్వాసాన్ని, మనోదైర్యాన్ని ఇచ్చే బ్యూటీ పెజంట్ కూడా చాలా చోట్ల నిర్వహించ నున్నారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు రాబోతున్నాయి. చాలామంది వేసవి సెలవల్లో ఇండియా వెళుతూ ఉంటారు. ఆటా కన్వెన్షన్ వల్ల ఎంతో మంది జాన్ 2వ వారం లేక ఆ తర్వాత వెళ్లేట్లుగా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. మీరు కూడా ఈ గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకోండి.