పాకిస్థాన్ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ రెండోసారి ఎన్నికయ్యారు. పాక్ జాతీయ అసెంబ్లీలో కొత్త ప్రధాని ఎన్నిక కోసం ఓటింగ్ నిర్వహించారు. 336 మంది సభ్యులు గల సభలో పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్( పీఎం ఎల్ -ఎన్) అభ్యర్థి షెహబాజ్ షరీఫ్ 201 ఓట్లు సాధించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అభ్యర్థి ఒమర్ ఆయుబ్ ఖాన్కు 92 ఓట్లు వచ్చాయి. దీంతో పాకిస్థాన్ 24వ ప్రధానమంత్రిగా 72 ఏండ్ల షెహబాజ్ షరీఫ్ సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)