Skip to main content

Namaste NRI

పాకిస్థాన్‌ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌.. వరుసగా రెండోసారి

పాకిస్థాన్‌ ప్రధానమంత్రిగా షెహబాజ్‌ షరీఫ్‌ రెండోసారి ఎన్నికయ్యారు. పాక్‌ జాతీయ అసెంబ్లీలో కొత్త ప్రధాని ఎన్నిక కోసం ఓటింగ్‌ నిర్వహించారు. 336 మంది సభ్యులు గల సభలో పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌( పీఎం ఎల్‌ -ఎన్‌) అభ్యర్థి షెహబాజ్‌ షరీఫ్‌ 201 ఓట్లు సాధించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అభ్యర్థి ఒమర్‌ ఆయుబ్‌ ఖాన్‌కు 92 ఓట్లు వచ్చాయి. దీంతో పాకిస్థాన్‌ 24వ ప్రధానమంత్రిగా 72 ఏండ్ల షెహబాజ్‌ షరీఫ్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

Social Share Spread Message

Latest News