పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశ ప్రథమ మహిళగా జర్దారీ తన కుమార్తె అసీఫా భుట్టో (31)ని అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా దేశాధ్యక్షుని సతీమణి ఆ దేశ ప్రథమ మహిళ అవుతారు. అయితే ఆయన సతీమణి బెనజీర్ భుట్టో 2007లో హత్యకు గురైన తర్వాత ఆయన పునర్వివాహం చేసుకోలేదు. 2008-2013 మధ్య కాలంలో కూడా జర్దారీ దేశాధ్యక్ష పదవిని నిర్వహించారు. అప్పుడు దేశ ప్రథమ మహిళ హోదాను ఎవరికీ ఇవ్వలేదు. ఈసారి మాత్రం తన కుమార్తె అసీఫాను దేశ ప్రథమ మహిళగా గుర్తించాలని ఆయన నిర్ణయించుకున్నారు.