Skip to main content

Namaste NRI

పాకిస్థాన్‌ అధ్యక్షుడు  కీలక నిర్ణయం

పాకిస్థాన్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశ ప్రథమ మహిళగా జర్దారీ తన కుమార్తె అసీఫా భుట్టో (31)ని అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా దేశాధ్యక్షుని సతీమణి ఆ దేశ ప్రథమ మహిళ అవుతారు. అయితే ఆయన సతీమణి బెనజీర్‌ భుట్టో 2007లో హత్యకు గురైన తర్వాత ఆయన పునర్వివాహం చేసుకోలేదు. 2008-2013 మధ్య కాలంలో కూడా జర్దారీ దేశాధ్యక్ష పదవిని నిర్వహించారు. అప్పుడు దేశ ప్రథమ మహిళ హోదాను ఎవరికీ ఇవ్వలేదు. ఈసారి మాత్రం తన కుమార్తె అసీఫాను దేశ ప్రథమ మహిళగా గుర్తించాలని ఆయన నిర్ణయించుకున్నారు.

Social Share Spread Message

Latest News