అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఆస్కార్ వేదికగా తన పరువు పోగొట్టుకున్నాడు. దీనికి ఆయన నోటిదురుసే కారణం. ఆస్కార్ కార్యక్రమ వ్యాఖ్యాత జిమ్మీని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో విమర్శించాడు. వేడుకలు జరుగుతున్న సమయానికి జిమ్మి దృష్టికి ఈ విషయం వచ్చింది. ఉత్తమ చిత్రం అవార్డును ప్రకటించే సమయంలో జిమ్మీ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పుడే తన పనితీరుపై ఓ సమీక్ష అందిందని ట్రంప్ పేరు చెప్పకుండా అతని పోస్ట్‌ను చదివి వినిపించాడు. కార్యక్రమాన్ని వీక్షించి నందుకు ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపిన ఆయన, ఇంకా మీ జైలు జీవితం ముగియలేదా అని ప్రశ్నించాడు. దీంతో సభికులు ఒక్కసారిగా నవ్వారు.ట్రంప్ 4 కేసులు ఎదుర్కొంటున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)