Skip to main content

Namaste NRI

ఆస్కార్‌ వేదికగా పరువు పోగొట్టుకున్న ట్రంప్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా ఆస్కార్‌ వేదికగా తన పరువు పోగొట్టుకున్నాడు. దీనికి ఆయన నోటిదురుసే కారణం. ఆస్కార్‌ కార్యక్రమ వ్యాఖ్యాత జిమ్మీని ట్రంప్‌ తన సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌లో విమర్శించాడు. వేడుకలు జరుగుతున్న సమయానికి జిమ్మి దృష్టికి ఈ విషయం వచ్చింది. ఉత్తమ చిత్రం అవార్డును ప్రకటించే సమయంలో జిమ్మీ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పుడే తన పనితీరుపై ఓ సమీక్ష అందిందని ట్రంప్‌ పేరు చెప్పకుండా అతని పోస్ట్‌ను చదివి వినిపించాడు. కార్యక్రమాన్ని వీక్షించి నందుకు ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపిన ఆయన, ఇంకా మీ జైలు జీవితం ముగియలేదా  అని ప్రశ్నించాడు. దీంతో సభికులు ఒక్కసారిగా నవ్వారు.ట్రంప్‌ 4 కేసులు ఎదుర్కొంటున్నారు.

Social Share Spread Message

Latest News