తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ నటిస్తున్న తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తు న్నది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్‌లో షూటింగ్‌ను ప్రారంభించి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ మాట్లాడుతూ అజిత్ వంటి అగ్ర హీరోతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాం. ఆయన ఇమేజ్‌కు తగినట్లుగా దర్శకుడు అధిక్ రవిచంద్రన్ అద్భుతమైన కథను తయారు చేశాడు. ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది అన్నారు. వినూత్నమైన కథతో, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అభినందన్ రామానుజం, రచన-దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్.
