బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్‌దేశ్ పాండే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రజాకార్. సమర్‌వీర్ క్రియేషన్స్ పతాకంపై యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. నేడు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిం చారు. ఈ చిత్రం తెలంగాణ చరిత్రకు అద్దం పడుతుందని, చక్కటి సందేశం ఉందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు. రజాకార్లపై నాటి వీరుల పోరాటాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుందని దర్శకుడు యాటా సత్యనారాయణ పేర్కొన్నారు. గత చరిత్రను నేటి తరానికి తెలియజెప్పడానికి ఈ సినిమా తీశామని, మన పోరాటయోధుల గురించి రాబోవు తరాల వారు తెలుసుకునేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
