బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను అడ్డం పెట్టుకుని మోదీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ ఎన్నారై బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీశ్ కుమార్ ఆరోపిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఒక బూటకం అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం, ఎన్నారైలంతా అండగా ఉంటామని అన్నారు. చట్టపరంగా న్యాయస్థానంలో పోరాడుతామని అన్నారు.
లోకసభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీని మానసికంగా దెబ్బ తీయాలనే ఆలోచనతో రాజకీయ కుట్రతో ఎన్నికల నోటిపికేషన్ వెలువడే సమయంలో అరెస్టు చేశారన్నారు. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ఉండొద్దని, ఢిల్లీ నుండే తెలంగాణను పాలించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటై బీఆర్ఎస్ పార్టీ లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దేశంలో అన్ని రంగాల్లో ముందు ఉన్న తెలంగాణను చూసి ఢిల్లీ బానిసలు కుళ్లుకుంటున్నారని ఆరోపించారు.